తెలంగాణ సాహితీ సంస్థలు.. ఏ సంస్థ ఎప్పుడు ఏర్పడిందో తెలుసా?

తెలంగాణ సాహితీ సంస్థలు.. ఏ సంస్థ ఎప్పుడు ఏర్పడిందో తెలుసా?

Telangana Literary Organisations: 1934లో సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవి, పండితుల రచనలతో రూపొందించిన గోల్కొండ కవుల సంచిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. చందాల కేశవదాసు 1911లో రచించిన కనకతార నాటకంతో ఆధునిక నాటక రచనకు పునాదులు పడ్డాయి. కోదాటి నారాయణరావు ప్రగతి, బాల సరస్వతి పత్రికలు నడిపాడు. రత్నమాంబ దేశాయి స్త్రీలు విద్యలోనూ, కవిత్వంలోనూ రాణించడానికి సమాజం సిద్ధంగా ఉండాలని హితబోధిని పత్రికలో అనేక పద్యాలు రాశారు. పాశం నారాయణరెడ్డి రచనలు.. దయానంద సరస్వతి జీవిత చరిత్ర, త్యాగమూర్తులు, సదాశివ రెడ్డి. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా అనేక సాహిత్య సంస్థలు స్థాపించారు.

సాహితీ మేఖల (1936)

ఇది మొదటగా ఏర్పడిన సాహిత్య సంస్థ.
ఈ సాహితీ మేఖలను 1936లో అంటిపూడి వెంకటరత్నశాస్త్రి నల్గొండలో ప్రారంభించారు.
సాహితీ మేఖల ప్రచురించిన గ్రంథాలు
దాశరథి కృష్ణమాచార్యులు – అగ్నిధార
అంబటిపూడి వెంకటరత్నం – తర్కభాష
పున్న అంజయ్య – నీలగిరి కవుల సంచిక
పులిజాల గోపాలరావు – ఖడ్గ తిక్కన 

సాధన సమితి (1939)

ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు, వెల్దుర్తి మాణిక్యరావు. 
ప్రచురించిన గ్రంథాలు 
దేవులపల్లి రామానుజరావు  
నవ్య కవితా నీరాజనం (వ్యాసాలు)
బూర్గుల రంగనాథరావు – వాహ్యాళి (కథలు)
బోగి నారాయణమూర్తి – పరీక్ష చదువు (నాటిక)
గాదిరాజు వెంకట రమణయ్య – భోజరాజు (పద్యకావ్యం) 

అణా గ్రంథమాల (1939)

1939లో కేసీ గుప్తా అణా గ్రంథమాలను స్థాపించాడు. ఈ సంస్థ తొలి ప్రచురణ – హైదరాబాద్ రాజ్యాంగ సంస్కరణలు.
1943లో కాళోజీ నారాయణరావు రాసిన కింద కథలను అణా గ్రంథమాల ప్రచురించింది. 
మనమేనయం – పశుహింస గురించి కథ
తెలియక ప్రేమ తెలిసి ద్వేషం – కుల వివక్షత గురించి
విభూతి – ఆధునికత వేలంవెర్రి వేయడాన్ని విమర్శించే కథ

దేశోద్ధారక గ్రంథ మాల ( 1938)

ఈ సంస్థను వట్టికోట ఆళ్వారు స్వామి స్థాపించాడు. 
ప్రచురణలు 
కాళోజీ నారాయణ రావు – నా గొడవ (కవితలు)
సురవరం ప్రతాపరెడ్డి – ప్రజాధికారములు 

వివేకవర్ధిని పరిషత్ (1941)

ఈ సంస్థ స్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి.
ప్రచురించిన గ్రంథాలు
సురవరం ప్రతాపరెడ్డి – రామాయణ విశేషాలు, మృత్యు సిద్ధాంతం, ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం.

ఆంధ్ర సారస్వత పరిషత్తు

1943, మే 26న హైదరాబాద్ రెడ్డి హాస్టల్​లో జరిగిన సమావేశంలో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు ఆవిర్భవించింది.
ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో ముఖ్యులు మాడపాటి హనుమంతరావు, 
దేవులపల్లి రామానుజరావు,
బూర్గుల రంగనాథరావు.
ఈ సంస్థ ముఖ్యలక్ష్యాలు
ప్రజల్లో మాతృభాషాభిమానం పెంచాలి.
ఉత్తమ రచనలకు బహుమానాలు అందించాలి.
గ్రామాల్లో రాత్రిపూట బడులు నిర్వహించి అక్షరాస్యత పెంచాలి.